సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 24 ఆగస్టు 2020 (19:40 IST)

అంచెలంచెలుగా ఎదుగుతున్న సిఎం జగన్ కుమార్తె హర్షా రెడ్డి

సాధారణంగా విఐపిల కుమారులు, కుమార్తెలు ఫారెన్‌లోనే ఎక్కువగా విద్యను అభ్యసిస్తూ ఉంటారు. బేసిక్స్ నుంచి విదేశాల్లోనే చదువుకుంటూ పట్టాలు పొంది ఆ తరువాత స్వస్థలానికి వస్తుంటారు. లేకుంటే అక్కడే సెటిల్ అయిపోతూ ఉంటారు. ప్రముఖుల బిడ్డలు కదా అంతేమరి అనుకునే సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
 
కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొదటి కుమార్తె హర్షా రెడ్డి మాత్రం చదువులో దిట్ట. చిన్నప్పటి నుంచే జగన్ ఇద్దరు కుమార్తెలు ఎంతో కష్టపడి చదివి ఉన్నతస్థానాలు వైపు వెళుతున్నారు. తాజాగా పెద్ద కుమార్తె హర్షారెడ్డి ప్రపంచ ప్రఖ్యాత ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో సీటు సాధించింది.
 
పారిస్ క్యాంప్‌లో మాస్టర్ డిగ్రీ చదవనుంది హర్షారెడ్డి. ఆమె టాలెంట్‌తోనే సీటు సంపాదించుకోగలిగింది హర్షారెడ్డి. ఎలాంటి రెకమెండేషన్ లేకుండా పరీక్ష రాసి ర్యాంక్ సాధించి సీటును సంపాదించుకోగలిగింది. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్‌గా మారింది. 
 
హర్షారెడ్డిని పారిస్ పంపించేందుకు మంగళవారం సిఎం బెంగళూరు వెళ్ళనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. సిఎం పెద్ద కుమార్తే కాకుండా చిన్న కుమార్తె కూడా చదువులో దిట్ట. ఇద్దరూ బాగా చదువుతుండటంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోతోందట.