'సారంగదరియా'కి స్టెప్పులేసిన సితార.. వీడియో వైరల్
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార ఘట్టమనేనికి సోషల్ మీడియాలో వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తాజాగా ఆమె చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. స్టార్ హీరోయిన్ సాయి పల్లవి చేసిన ఫిదా సినిమాలోని ఐకానిక్ డ్యాన్స్ నెంబర్ 'సారంగదరియా'ని సితార అందంగా రీక్రియేట్ చేసింది.
అప్రయత్నంగా గ్రేస్‌తో, సితార సాయి పల్లవిలా డ్యాన్స్ ఇరగదీసింది. తన ఎక్స్‌ప్రెషన్స్, ఎనర్జిటిక్ డ్యాన్స్ మూవ్‌లతో పాటకు ప్రాణం పోసింది. సితార ప్రఖ్యాత కొరియోగ్రాఫర్ అనీ మాస్టర్ నుండి ఈ పాటకు డ్యాన్స్ చేసింది. నిమిషాల వ్యవధిలో, వీడియో వైరల్ అయ్యింది.