గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi

ప్రిన్స్ ఫాలోయర్ల సంఖ్య ఎంతో తెలుసా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఇటు సినీ కేరీర్‌లోనే కాకుండా సోషల్ మీడియాలో సైతం ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నాడు. తాజాగా 'స్పైడ‌ర్' చిత్రంతో కోలీవుడ్‌కి ప‌రిచ‌యమైన మ‌హేష్ బాబు త్వ‌ర‌లో "భ‌ర

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఇటు సినీ కేరీర్‌లోనే కాకుండా సోషల్ మీడియాలో సైతం ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నాడు. తాజాగా 'స్పైడ‌ర్' చిత్రంతో కోలీవుడ్‌కి ప‌రిచ‌యమైన మ‌హేష్ బాబు త్వ‌ర‌లో "భ‌ర‌త్ అను నేను" చిత్రాన్ని చేస్తున్నాడు. 
 
అయితే సోష‌ల్ మీడియాలోనూ మ‌హేష్‌కి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్ర‌స్తుతం ఆయ‌న ట్విట్ట‌ర్ ఫాలోవ‌ర్స్ సంఖ్య 5 మిలియ‌న్ల‌కి చేరింది. ద‌క్షిణాది తార‌ల‌లో ఇప్ప‌టివ‌ర‌కు 5 మిలియ‌న్స్ దాటింది. తెలుగులో మ‌హేష్ త‌ర్వాతి స్థానంలో నాగార్జున 4.5 మిలియన్ ఫాలోవ‌ర్స్‌తో ఉండ‌గా, ద‌గ్గుబాటి రానాకి 4.48 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ ఉన్నారు. 
 
ఇక ప‌వ‌న్‌ని 2.2 ల‌క్ష‌ల మంది అనుస‌రిస్తుండ‌గా, రాజమౌళి 3.75 మిలియన్ ఫాలోవర్లతో కొనసాగుతున్నాడు. రెండేళ్ల కిందట ట్విట్టర్లోకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ వెనుక 17 లక్షల మంది ఉన్నారు. తమిళ హీరో ధనుష్ 6.4 మిలియన్ల ఫాలోవర్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.