బాహుబలితో భయం లేదు.. ఏప్రిల్ 14న మహేష్ బాబు-మురుగదాస్ సినిమా రిలీజ్..
బాహుబలితో పోటీపడకూడదని టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు డిసైడైపోయారు. గత సంవత్సరం 'బాహుబలి' కంటే ముందు 'శ్రీమంతుడు' రిలీజ్ కావలసిందే. కానీ రాజమౌళిపై ఉన్న గౌరవంతో 'బాహుబలి' సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీకే
బాహుబలితో పోటీపడకూడదని టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు డిసైడైపోయారు. గత సంవత్సరం 'బాహుబలి' కంటే ముందు 'శ్రీమంతుడు' రిలీజ్ కావలసిందే. కానీ రాజమౌళిపై ఉన్న గౌరవంతో 'బాహుబలి' సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీకే అత్యంత ప్రతిష్టాత్మకం అని భావించిన మహేష్ ఆ రేస్ నుంచి తప్పుకుని ఏకంగా 'బాహుబలి' కి ఒక నెల రోజులు గ్యాప్ ఇచ్చాడు. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి తలెత్తే ఛాన్సే లేదంటున్నారు సినీ జనం.
ఫిలింనగర్‌లో వినపడుతున్న వార్తల ప్రకారం మురగదాస్ మహేష్ బాబుల మూవీకి వచ్చే సంవత్సరం ఏప్రిల్ 14న రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. తమిళ ఉగాది రోజు కావడంతో సెంటిమెంట్‌గా డేట్ బాగుంటుందనే నిర్ణయానికి మహేష్, మురుగదాస్‌లు వచ్చినట్లు టాక్. ఏప్రిల్ 28న 'బాహుబలి 2' విడుదల అవుతున్నా ఆ రిలీజ్ డేట్‌కు ఇంకా రెండు వారాలు సమయం ఉంది కాబట్టి ఈ గ్యాప్ తమకు చాలు అన్న ఉద్దేశ్యంలో మురుగదాస్-మహేష్ బాబు తమ సినిమాను విడుదల చేయాలని డిసైడైపోయారు.
అయితే ఈ సినిమాకు మహేష్ ఊహించిన విధంగా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చినా కేవలం రెండు వారాల గ్యాప్ తో వచ్చే 'బాహుబలి 2' కోసం ధియేటర్ల కోసం జరిగే వేటను తట్టుకుని మహేష్ సినిమా ఎంత వరకు నిలబడగలదు అన్న అనుమానాలు చాలామంది వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయాలు ఏమి మహేష్ పట్టించుకోవడం లేదు అని టాక్. ఇక దీపావళికి రిలీజ్ కాబోతున్న మహేష్ సినిమా టీజర్‌కు వచ్చే స్పందన బట్టి ఈ సినిమా రిలీజ్ డేట్‌పై మరింత క్లారిటీ వస్తుందని టాక్.