ఆదివారం, 16 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 25 నవంబరు 2016 (11:05 IST)

అతను జస్ట్ ఫ్రెండ్ మాత్రమే.. అపుడపుడూ కలుస్తుంటాం : మలైకా అరోరా ఖాన్

బాలీవుడ్ నటి నటి మలైకా అరోరా ఖాన్ తన ప్రియుడు అర్జున్ కపూర్‌కు మధ్య ఉన్న సంబంధంపై స్పందించింది. తమ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం కేవలం స్నేహ బంధం మాత్రమేనని ఇందులో ఎలాంటి అపార్థాలకు తావులేదని తేల్చి చెప్పిం

బాలీవుడ్ నటి నటి మలైకా అరోరా ఖాన్ తన ప్రియుడు అర్జున్ కపూర్‌కు మధ్య ఉన్న సంబంధంపై స్పందించింది. తమ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం కేవలం స్నేహ బంధం మాత్రమేనని ఇందులో ఎలాంటి అపార్థాలకు తావులేదని తేల్చి చెప్పింది.
 
అప్పటి నుంచి వీరిమధ్య ఏదో నడుస్తోందని ఈ మధ్య పుకార్లు షికార్లు చేశాయి. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని ఎక్కడ పడితే అక్కడ కనబడడంతో ఈ రూమర్ల జోరు పెరిగింది. వీళ్ళ మధ్య ఎఫైర్ నడుస్తోందని జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
దీనిపై ఆమె మరోమారు స్పందించింది. తమ మధ్య ఎలాంటి రిలేషన్ షిప్ లేదని, అర్జున్ కపూర్ తనకు మంచి ఫ్రెండ్ మాత్రమేనని, తామిద్దరు అపుడపుడూ మాత్రమే కలుసుకుంటామన్నారు. మలైకా ఈ రూమర్లను ఖండించినా.. అర్జున్ కపూర్ మాత్రం పెదవి విప్పకపోవడం విశేషం.