గోవాలో ఎంజాయ్ చేస్తున్న మలయాళ కుట్టి... ఆ సంగతేంటో చూస్తారా?
మలయాళ కుట్టి నయనతార ప్రస్తుతం గోవా ట్రిప్‌లో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తోందట. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటలోను చూస్తుంటే నిజమే అనిపిస్తుంది.
గత కొన్నేళ్లుగా నయనతార, విఘ్నేశ్ ప్రేమలో ఉన్నట్లు వార్తలు హల్‌చల్ చేశాయి. ఈ విషయాన్ని ఇద్దరూ మీడియా ముందు పరోక్షంగా చెప్పారనుకోండి. నయన్‌తో సన్నిహితంగా ఉన్న ఫొటోలను విఘ్నేశ్ తరచూ పోషల్ మీడియాలో షేర్ చేస్తుండటం కూడా వీరి బంధానికి బలం చేకూరుస్తున్నాయి.
ఆ ఫొటోలు చూసిన వారెవరైనా ఇట్టే చెప్పేస్తారు వారు రిలేషన్‌లో ఉన్నారని. ఇప్పుడు విఘ్నేశ్ కుటుంబసభ్యులతో కలిసి నయనతార గోవా ట్రిప్ భలే ఎంజాయ్ చేస్తోంది. విఘ్నేశ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు ట్విటర్‌లో బాగా ట్రెండ్ అవుతున్నాయి.
నయనతార తెలుపు రంగు గౌనులో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ, పువ్వులు కోస్తూ కనిపించింది. 'తెలుపు ఎప్పుడూ అద్భుతంగానే ఉంటుంది' అని నయన్ ఫొటోలకు విఘ్నేశ్ క్యాప్షన్ ఇచ్చారు. తన తల్లి స్విమ్మింగ్‌పూల్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలనూ షేర్ చేశారు.
'అమ్మ ముఖంలో చిరునవ్వు నేరుగా మన హృదయాల్ని తాకుతుంది. మన తల్లిదండ్రుల సంతోషానికి మించిన సంతృప్తి, ఆనందం మరొకటి ఉండదు. ఓ విధంగా చెప్పాలంటే.. మన జీవిత లక్ష్యమే వారిని సంతోషంగా ఉంచడం' అని చెప్పుకొచ్చారు.