శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 17 డిశెంబరు 2018 (12:30 IST)

కారు డ్రైవర్‌తో కలిసి.. మలయాళ నటి అశ్వతి బాబు అలా చేసింది..?

మలయాళ సినీ నటి అశ్వతి బాబు తన కారు డ్రైవర్‌తో కలిసి ప్రమాదకర ఎండిఎంఏ డ్రగ్‌ని కస్టమర్‌కి అందించేందుకు ఎదురుచూస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసు విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఫలితంగా ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఎంతమంది పేర్లు బయటపడతాయోనని ఉత్కంఠ నెలకొంది. 
 
కాగా గత ఏడాది టాలీవుడ్‌లో డ్రగ్స్ స్కాండల్ డొంక కదిలిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో పలువురు సెలబ్రిటీల గుట్టు రట్టు అయ్యింది. కానీ ప్రస్తుతం ఈ వ్యవహారం సద్దుమణిగినా మాలీవుడ్‌లో మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు అశ్వని తన ఇంటి పరిసరాల్లో తచ్చాడుతూ కనిపించింది. అప్పటికే మఫ్టీలో వున్న పోలీసులు తెలివిగా ఆమెను అదుపులోకి తీసుకున్నారు. 
 
ఆదివారం అశ్వతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అశ్వతి తిరువనంతపురం నుంచి వచ్చి మాలీవుడ్‌గా నటిగా స్థిరపడింది. నటిగా గుర్తింపు పొందిన ఆమెను ఇలాంటి వ్యవహారాలతో డబ్బు బాగా సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అశ్వతి డ్రగ్స్ సప్లయ్ చేస్తుందని తెలుసుకున్న సన్నిహితులు, స్నేహితులు షాక్ అవుతున్నారు.