శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: మంగళవారం, 2 ఆగస్టు 2016 (12:50 IST)

జూనియర్ ఆర్టిస్టులు మమ్మల్ని చెడబాదారు... మంచు మనోజ్ ఫిర్యాదు

మంచు ఫ్యామిలీ వివాదాలకు పేరు ఏమోకానీ.. తాజాగా మంచు మనోజ్‌ తమను దుర్భాషలాడి.. తమపై చేసుకున్నాడని.. జూనియర్‌ ఆర్టిస్టులు, వారి మేనేజర్‌ ప్రసాద్‌ పోలీసుస్టేషన్‌లో కేసు పెట్టారు. అనంతరం.. మంచు మనోజ్‌ కూడా... ఆర్టిస్టులు షూటింగ్‌లో తెగ ఇబ్బందులు కలుగచేశార

మంచు ఫ్యామిలీ వివాదాలకు పేరు ఏమోకానీ.. తాజాగా మంచు మనోజ్‌ తమను దుర్భాషలాడి.. తమపై చేసుకున్నాడని.. జూనియర్‌ ఆర్టిస్టులు, వారి మేనేజర్‌ ప్రసాద్‌ పోలీసుస్టేషన్‌లో కేసు పెట్టారు. అనంతరం.. మంచు మనోజ్‌ కూడా... ఆర్టిస్టులు షూటింగ్‌లో తెగ ఇబ్బందులు కలుగచేశారనీ, వారే తమపై చేయిచేసుకున్నారని.. తిరిగి కేసుపెట్టారు. దీంతో కేసు నమోదు చేశారు.
 
వివరాల్లోకి వెళితే... వైజాగ్‌కు సమీపంలోని పరవాడలోని ముత్యాలపాలెం సమీపంలో గత 15 రోజులుగా మంచు మనోజ్‌ సినిమా షూటింగ్‌ జరుగుతుంది. కొన్ని యాక్షన్‌ సన్నివేశాలు చిత్రిస్తున్నారు. దానికోసం కొంతమంది జూనియర్‌ ఆర్టిస్టులు కావాల్సివుంది. వైజాగ్‌ జూనియర్‌ ఆర్టిస్టుల అసోసియేషన్‌ అధ్యక్షడు ప్రసాద్‌ను చిత్ర మేనేజర్‌ సంప్రదించాడు. అయితే 15 రోజులకుగాను 15 లక్షల ఖర్చయిందని ప్రసాద్‌.. చిత్ర నిర్మాత అచ్చిబాబును సంప్రదించగా కేవలం 5లక్షలే ఇచ్చారు. ఇదేమిటని అడిగితే.. మంచు మనోజ్‌ సాయంతో వారు తమను దుర్భాషలాడుతూ... చేయిచేసుకున్నారనీ, దాంతో.. జూనియర్‌ ఆర్టిస్టులు అంతా ధర్నా చేసి లోకల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
 
విషయం తెలుసుకున్న నిర్మాత, మనోజ్‌.. పోలీసు స్టేషన్‌కు వెళ్ళి.. జూనియర్‌ ఆర్టిస్టులపై తిరిగి ఫిర్యాదు చేశాడు. షూటింగ్‌ సక్రమంగా జరగకుండా ఇబ్బందులుపాలు చేయడమే కాకుండా.. అదేమని అడిగితే.. గత నెల 26న చేయిచేసుకున్నారని.. మంచు మనోజ్‌ ఫిర్యాదు చేశాడు. దీంతో ఇరువర్గాల ఫిర్యాదు మేరకు దర్యాప్తు జరుగుతోంది.