1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Israel-Iran war: PM Netanyahu says 'President Trump, I Thank You' after US bombs 3 nuclear sites in Iran

Netanyahu: డొనాల్డ్ ట్రంప్‌కు నెతన్యాహు కృతజ్ఞతలు.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా.. ఎవరు?

Netanyahu
Netanyahu
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇరాన్‌లోని మూడు అణుకేంద్రాలపై అమెరికా బీ-2 స్పిరిట్‌ బాంబర్లతో దాడి చేయడంపై నెతన్యాహు కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం చరిత్రను మార్చేస్తుందని నెతన్యాహు చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. 
 
"అధ్యక్షుడు ట్రంప్‌నకు అభినందనలు. మీ అద్భుతమైన, ధర్మబద్ధమైన శక్తితో ఇరాన్‌ అణుకేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ మీ నిర్ణయం సాహసోపేతమైనది. ఇది చరిత్రను మార్చేస్తుంది." అని వ్యాఖ్యానించారు. 
 
అణుకేంద్రాల లక్ష్యంగా అమెరికా చేసిన దాడులు నిజంగా అద్వితీయమైనవి. భూమిపై మరే దేశం చేయలేనిది మీరు చేశారని నెతన్యాహు కొనియాడారు. ఇంకా నెతన్యాహు మాట్లాడుతూ.. ఇరాన్‌ అణుకేంద్రాలను నాశనం చేస్తామని యుద్ధ ప్రారంభంలో తాను మాటిచ్చానని.. తాజాగా దాన్ని నిలబెట్టుకున్నానని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అణుకేంద్రాలను ధ్వంసం చేయాలని ఐడీఎఫ్ ఈ నెల 13న చేపట్టిన పనిని.. అమెరికా పూర్తిచేసిందన్నారు.
తర్వాతి కథనం
జగన్‍‌కు పబ్లిసిటీ పిచ్చి పీక్‌కు చేరింది.. ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయ్... మంత్రి గొట్టిపాటి