మంగళవారం, 25 జూన్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 16 నవంబరు 2023 (13:44 IST)

మంగళవారం సినిమా దర్శకుడి అంచనాలను దాటుతుందా?

Mangalavarm premiers
Mangalavarm premiers
పాయల్ రాజ్ పుత్, అజ్మల్ నటించిన మంగళవారం  సినిమా రేపు విడుదలకాబోతుంది. అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ముద్ర మీడియా నిర్మిచింది. కాగా, రెండు రోజుల నాడు టికెట్ బుకింగ్ ఓపెన్ అయ్యాయి. కానీ అనుకున్నంత స్పీడ్ గా లేవు. కానీ నేడు సినీ ప్రముఖుల నుంచి అనూహ్య స్పందన రావడంతో ఈ రోజు ప్రీమియర్ షోలు హైదరాబాద్ లో పెంచారు. మొదట ఐ మాక్స్ వరకు పరిమితం అనుకున్నా, ఆ తర్వాత ఆరు థియేటర్లలో ప్రదర్శించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
 
ఈ సినిమా కాంతార తరహాలో ట్రైలర్ వుండడంతో దీనిపై బిజినెస్ క్రేజ్ వచ్చింది. అందుకు బిజినెస్ బాగా అయిందని చిత్ర దర్శకుడు అజయ్ భూపతి తెలియజేశారు. పాయల్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు. ఆర్. ఎక్స్. 100 తరహాలో పాయల్  ఎక్స్ పోజింగ్ వున్నా.. అది కథ మేరకే వుంటుందని తెలియజేశారు. అజనీష్ లోక్ నాథ్ సంగీతం సమకూర్చిన ఈ సినిమా విడుదల తర్వాత మౌత్ టాక్ నుబట్టి సినిమా రన్నింగ్ వుంటుందని ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి.