గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 16 నవంబరు 2023 (13:17 IST)

రంజిత్ శంకర్ దర్శకత్వంలో ఉన్ని ముకుందన్ - మహిమా నంబియార్ జంటగా నటిస్తున్న `జైగణేష్`

Unni Mukundan look
Unni Mukundan look
మలయాళ స్టార్ ఉన్ని ముకుందన్, మహిమా నంబియార్ జంటగా నటిస్తున్న `జైగణేష్` సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నేడు విడుదలైంది. రంజిత్ శంకర్ దర్శకత్వంలో UMF & డ్రీమ్స్ N బియాండ్ ప్రొడక్షన్ నిర్మాణంలో రూపొందుతోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ వంటి ఐదుభాషల్లో థియేటర్లలో, వేసవి 2024 లో విడుదల కాబోతుంది. 
 
`జైగణేష్` సినిమా లో ఉన్ని ముకుందన్ పాత్ర అత్యంత ఛాలెంజింగ్‌లో ఒకటిగా చెప్పబడింది, పిల్లలు,  పెద్దలు మెచ్చేవిధంగా థ్రిల్లింగ్ బ్యాక్‌డ్రాప్‌తో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో రూపొందుతోంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ చిత్రం, రంజిత్ శంకర్ కు చెందిన డ్రీమ్స్ ఎన్ బియాండ్ ప్రొడక్షన్స్ ,ఉన్ని ముకుందన్ ఫిలిమ్స్ భాగస్వామ్యంతో రూపొందించబడుతోంది.
 
మహిమా నంబియార్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో  జోమోల్ కొంత విరామం తర్వాత క్రిమినల్ లాయర్‌గా ప్రత్యేకంగా కన్పిస్తున్నారు. ఇందులో హరీష్ పేరడి, అశోక్, రవీంద్ర విజయ్, నందు తదితరులు ఉన్నారు.
 
మాలికాపురం తర్వాత జై గణేష్ ను ఉన్ని తదుపరి మలయాళ చిత్రం చేస్తూ ఎర్నాకులం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుగుతోంది. సాంకేతిక విభాగంలో సినిమాటోగ్రాఫర్ చంద్రు సెల్వరాజ్, ఎడిటర్ సంగీత్ ప్రతాప్, మ్యూజిక్ కంపోజర్ శంకర్ శర్మ వంటి ప్రముఖ ప్రతిభావంతులు పనిచేస్తున్నారు. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.