శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 4 జనవరి 2019 (15:09 IST)

''మణికర్ణిక'' తెలుగు ట్రైలర్..(వీడియో)

తెలుగు మణికర్ణిక ట్రైలర్ విడుదలైంది. ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవిత కథ ఆధారంగా మణికర్ణిక మూవీని రూపొందించారు. ఈ సినిమా హిందీ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్న నేపథ్యంలో.. తాజాగా తెలుగు మణికర్ణిక ట్రైలర్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్లు, టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. 
 
తాజాగా విడుదలైన తెలుగు మణికర్ణిక ట్రైలర్‌లో కంగనా రనౌత్ సత్తా చాటింది. ఝాన్సీ రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్న బ్రిటీష్ పరిపాలనకు వ్యతిరేకంగా ఝాన్సీ లక్ష్మీబాయ్ చేసిన వీరోచిత చిత్రమే ''మణికర్ణిక''. 
 
జాతీయ స్థాయిలో రెండుసార్లు ఉత్తమ నటి అవార్డును అందుకున్న కంగనా రనౌత్.. ఈ సినిమాతో మూడో జాతీయ స్థాయి అవార్డును గెలుచుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని సినీ పండితులు అప్పుడే జోస్యం చెప్తున్నారు. తాజాగా తెలుగులో విడుదలైన కంగనా రనౌత్ మణికర్ణిక తెలుగు ట్రైలర్ ఎలా వుందో ఓసారి చూద్దాం..