ఆదివారం, 1 అక్టోబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 3 మే 2023 (14:16 IST)

ప్రముఖ కోలీవుడ్ దర్శక - హాస్య నటుడు కన్నుమూత

manobala
తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు, హాస్య నటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ మనోబాల బుధవారం కన్నుమూశారు. ఆయన వయసు 69 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఆయన బుధవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఈయన కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్టు సమాచారం. 
 
నాలుగు దశాబ్దాలుగా చిత్రపరిశ్రమలో కొనసాగుతున్న మనోబాల దాదాపు 450కి పైగా చిత్రాల్లో నటించారు. తమిళం, తెలుగు, మలయాళ భాషా చిత్రాల్లో నటించి ప్రముఖ హాస్య నటుడిగా గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఈయన చెన్నై సాలిగ్రామంలోని ఎల్వీ ప్రసాద్ రోడ్డు, ధనలక్ష్మీ కాలనీ ఎక్స్‌టెన్షన్‌లో ఉంటున్నారు. ఈయనకు భార్య ఉష, కుమారుడు హరీష్ ఉంటున్నారు. ఈయన అంత్యక్రియలు గురువారం జరిగే అవకాశం ఉంది.