గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 15 మే 2017 (09:36 IST)

భార్య వేధింపులు... మరాఠీ సినీ నిర్మాత ఆత్మహత్య

భార్య వేధింపులు భరించలేని ఓ సినీ నిర్మాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పూణెలో జరిగింది. ఆ చిత్ర నిర్మాత పేరు అతుల్ తాప్‌కీర్. నిర్మాత అతుల్ తాప్‌కీర్ ఆత్మహత్యకు ముందు అతుల్ తన ఆవేదనను ఫేస్‌బుక్ ద్వారా

భార్య వేధింపులు భరించలేని ఓ సినీ నిర్మాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పూణెలో జరిగింది. ఆ చిత్ర నిర్మాత పేరు అతుల్ తాప్‌కీర్. నిర్మాత అతుల్ తాప్‌కీర్ ఆత్మహత్యకు ముందు అతుల్ తన ఆవేదనను ఫేస్‌బుక్ ద్వారా పంచుకున్నారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే... 
 
'మిత్రులకు నమస్కారం. నేను అతుల్ తాప్‌కీర్. ఇటీవల ‘డోల్ తాశే’ అనే సినిమాను నిర్మించా. అందులో వచ్చిన నష్టాలు నన్ను కుంగదీశాయి. ఈ సినిమా నాకు స్ఫూర్తినిచ్చినా ఆర్థికంగా మాత్రం కుంగిపోయా. ఇదే విషయం నాన్న, అక్కయ్యలకు చెబితే వారు కొంత సాయం చేశారు. 
 
కానీ నా భార్య ప్రియాంక మాత్రం నన్ను వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టింది. నన్నే కాదు.. నా తండ్రిని కూడా..’ అని అతుల్ పేర్కొన్నారు. భార్య వేధింపులు భరించలేకే తనువు చాలిస్తున్నట్టు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పుణె పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.