శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 14 అక్టోబరు 2023 (17:01 IST)

"మార్టిన్ లూథర్ కింగ్"కు భలే రెస్పాన్స్..

Sampoornesh Babu
సంపూర్ణేష్ బాబు నటించిన "మార్టిన్ లూథర్ కింగ్" కొత్త ట్రెండ్‌కి నాంది పలికింది. సినిమా అధికారికంగా విడుదల కావడానికి రెండు వారాల ముందు విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, కర్నూలు, వరంగల్‌లో ప్రదర్శించబడింది. "మార్టిన్ లూథర్ కింగ్" అక్టోబర్ 27, 2023న థియేటర్‌లలో విడుదల కానుంది. 
 
అయితే, నటీనటుల, సిబ్బంది పైన పేర్కొన్న నగరాల్లో ప్రీమియర్‌లకు హాజరై సినిమాను ప్రమోట్ చేశారు. ఈ ప్రీమియర్ షోలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని YNOT స్టూడియోస్,  రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పిస్తున్నారు. 
 
మహాయానా మోషన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. పూజ కొల్లూరు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబు, వికె నరేష్, శరణ్య ప్రదీప్ తదితరులు నటించారు.