బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వి
Last Updated : బుధవారం, 29 జులై 2020 (18:43 IST)

మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక ఎంగేజ్‌మెంట్ ఫిక్స్

తెలుగు చిత్ర పరిశ్రమలో పెళ్లిళ్ల సందడి కొనసాగుతుంది. ఇటీవలే హీరో నితిన్- షాలినీలు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. త్వరలో మరో యువ హీరో భళ్లాల దేవుడు రానా దగ్గుబాటి కూడా ఓ ఇంటివాడు కానున్నాడు. తన ప్రేయసీ మిహీకా బజాజ్‌ను వచ్చే నెల 8న వివాహం చేసుకోనున్నాడు.
 
తాజాగా కొణిదెల వారింట కూడా పెళ్లి బాజాలు మోగనున్నాయి. మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొణిదెల, గుంటూరు ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు తనయుడు చైతన్యలకు పెళ్లి జరుగనున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 13న వీరి నిశ్చితార్థం జరగనుంది.
 
ఈ కార్యక్రమం కేవలం కుటుంబసభ్యుల మధ్యలో నిర్వహించనున్నారు. ఇప్పటికే ఎంగేజ్‌మెంట్‌కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. వీరి పెళ్లి ఈ ఏడాదిలో ఉంటుందని నాగబాబు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.