గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 28 జులై 2020 (19:36 IST)

పేరెంట్స్ ఫోన్ తీసుకెళ్లారని ఆత్మహత్య చేసుకున్న బాలిక

ప్రస్తుత మోడ్రన్ యుగంలో మొబైల్ ఫోన్ మన జీవితాల్లో ఓ భాగమైపోయింది. యువతరానికైతే ఇది లేకపోతే పొద్దే గడవటంలేదు. మొబైల్ ఓ వ్యసనంలా మారింది. ఎంతలా అంటే ఇది లేకపోతే ప్రాణం తీసుకునేంతలా.
 
తాజాగా హైదరాబాద్‌లో రాచకొండకమిషనరేట్ పరిధిలో జరిగిన ఈ ఘటనే దీనికి ఉదాహరణ. నగరానికి చెందిన ఓ 15ఏళ్ల బాలిక ఎప్పుడూ చేతిలో మొబైల్ పట్టుకొని, ఏవో వీడియోలు చూస్తూ ఉంటోంది. ఇది గమనించిన తల్లిదండ్రులు ఈ వ్యసనం నుంచి కుమార్తెను దూరం చేయాలనుకున్నారు. అంతే, ఆమె ఫోన్ వాళ్లు తీసేసుకున్నారు.
 
ఆ తర్వాత ఆఫీసుకు వెళ్లారు. వారు ఇంటికి తిరిగొచ్చే సరికే ఆ బాలిక ఉరేసుకొని కనిపించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.