బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 16 ఆగస్టు 2017 (16:15 IST)

''ఉయ్యాలవాడ నరసింహారెడ్డి''గా చిరంజీవి: పూజ సక్సెస్.. ఆగస్టు 22న ఫస్ట్ లుక్.. హీరోయిన్‌గా నయన?

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకో శుభవార్త. ఖైదీ 150 సినిమాకు తర్వాత 151వ సినిమాగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డిలో చిరంజీవి నటించబోతున్నారు. ఈ సినిమాకు తొలి అడుగు పడింది. బుధవారం కొణిదెల ప్రొడక్షన్స్‌ కార్యాలయ

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకో శుభవార్త. ఖైదీ 150 సినిమాకు తర్వాత 151వ సినిమాగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డిలో చిరంజీవి నటించబోతున్నారు. ఈ సినిమాకు తొలి అడుగు పడింది. బుధవారం కొణిదెల ప్రొడక్షన్స్‌ కార్యాలయంలో పూజా కార్యక్రమంతో సినిమా ప్రారంభించారు. ఈ పూజా కార్యక్రమంలో చిరంజీవితో పాటు ఆయన సతీమణి సురేఖ, కుమారుడు, హీరో రామ్ చరణ్, నిర్మాత అల్లు అరవింద్ తదితరులు పాల్గొన్నారు. 
 
స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా... కొణిదెల ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రాంచరణ్‌ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా నయనతారను తీసుకోవాలని చిత్రబృందం సంప్రదింపులు జరుపుతోంది. 
 
ఇక ఆగస్టు 22న చిరంజీవి పుట్టిన రోజును పురస్కరించుకుని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఫస్ట్ లుక్ విడుదల చేసేందుకు సినీ యూనిట్ ప్రయత్నిస్తోంది. రూ.100 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. నాలుగు భాషల్లో తెరకెక్కే ఈ చిత్రం నటీనటుల వివరాలను నిర్మాత రామ్ చరణ్ త్వరలో ప్రకటిస్తారు.