శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By kowsalya
Last Updated : శుక్రవారం, 27 ఏప్రియల్ 2018 (15:04 IST)

సోడాలు, ఐస్‌క్రీములు అమ్మిన ''రంగస్థలం'' హీరో

''రంగస్థలం'' సినిమాతో భారీ హిట్ కొట్టిసిన రామ్ చరణ్ ప్రస్తుతం ఆ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు. మరోవైపు బోయపాటి సినిమా షూటింగ్‌‌‌లో పాల్గొంటున్నాడు. అయితే చెర్రీ తాజాగా హైదరాబాద్‌లోని సారథి స్టూడియో వ

''రంగస్థలం'' సినిమాతో భారీ హిట్ కొట్టిసిన రామ్ చరణ్ ప్రస్తుతం ఆ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు. మరోవైపు బోయపాటి సినిమా షూటింగ్‌‌‌లో పాల్గొంటున్నాడు. అయితే చెర్రీ తాజాగా హైదరాబాద్‌లోని సారథి స్టూడియో వద్ద సోడాలు, ఐస్ క్రీములు అమ్ముతూ కనిపించారు.


చెర్రీని చూసిన అభిమానులు అక్కడికి భారీ ఎత్తున తరలి వచ్చారు. చెర్రీ సోడాలు, ఐస్‌క్రీములు ఎందుకు అమ్మారంటే.. మంచులక్ష్మి నిర్వహిస్తున్న మేము సైతం కార్యక్రమం కోసం. 
 
మంచు లక్ష్మీ హోస్ట్‌గా మేము సైతం అనే కార్యక్రమం జరుగుతుండగా, ఈ ప్రోగ్రాంకి అతిథిగా వచ్చేవారు ఏదో ఒక పని చేసి ఆ వచ్చిన డబ్బుతో పేదలకి సాయం చేస్తుంటారు. ఇప్పటికే మేము సైతం సీజన్ ఒకటో సీజన్‌ విజయంవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం రెండో సీజన్ నడుస్తోంది. ఇందులో భాగంగా చరణ్ సోడాలు, ఐస్ క్రీములు అమ్మి కొంత మెుత్తం సంపాదించారు. ఆ మెుత్తాన్ని పేద ప్రజలకి అందించనున్నారు. 
 
ఇక చెర్రీతో ఫోటోలు దిగేందుకు అభిమానులు తెగ పోటిపడ్డారు. ఇక చెర్రీ సినిమా సంగతికి వస్తే చెర్రీ, బోయపాటి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌గా వుంటుందని.. ఇందులో కైరా అద్వానీ హీరోయిన్ పాత్ర పోషిస్తోంది.