శనివారం, 23 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 18 ఫిబ్రవరి 2021 (15:50 IST)

72 ఏళ్ళ నాటి అక్కినేని జ్ఞాప‌కాలు

Late Akkineni Family
స‌రిగ్గా ఇదే రోజు, ఇదే నెల‌, ఫిబ్ర‌వ‌రి 18వ తేదీన అంటే 72 సంవత్సరాల క్రితం, అన్నపూర్ణ తన జీవితంలోకి వచ్చి మన జీవితాలను తీర్చిదిద్దారు. అంటూ అన్న‌పూర్ణ స్టూడియోస్ అధినేత అక్కినేని నాగార్జున గుర్తుచేస్తూ ట్వీట్ చేశారు. అప్ప‌టి ఫొటోల‌ను అందులో పొందుప‌రిచారు. అప్ప‌టి పెళ్లిరోజు ఫొటోతోపాటు కొత్త‌లో నాగేశ్వ‌ర‌రావుగారు, అన్న‌పూర్ణ‌మ్మ‌గారు దిగిన ఫొటోల‌ను నాగార్జున పోస్ట్ చేశాడు. మా అమ్మ, నాన్న జీవితంలో ప్ర‌వేశించి మా జీవితాల‌ను తీర్చిదిద్దారంటూ అప్ప‌టి  జ్ఞాప‌కాల‌ను నెమ‌రేసుకున్నాడు. ఈరోజు చాలా ప్ర‌త్యేకం. 22 ఎక‌రాల అన్న‌పూర్ణ స్టూడియోను నాన్న‌గారు శ్ర‌మించి ఒక రూపుకు తీసుకువ‌చ్చారు. నేడు అది మ‌రింత అభివృద్ధిచెంది సాంకేతిక‌త‌ను ఇమిడింప‌జేసుకుంటూ ఎంద‌రో కార్మికుల‌కు ఉపాధి క‌ల్గిస్తుంద‌ని తెలియ‌జేస్తున్నారు.
 
ఇదిలా వుండ‌గా, ఇదేరోజు రామానాయ‌డుగారి వ‌ర్ధంతి. డి.సురేష్‌బాబు ఫిలింఛాంబ‌ర్‌లోని నాయుడుగారి కాంస్య‌విగ్ర‌హానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. వెంక‌టేష్‌.. ఐల‌వ్‌యూ నాన్న‌. ఇంత త్వ‌ర‌‌గా రోజులు గ‌డిచిపోయాయంటే న‌మ్మ‌లేక‌పోతున్నానంటూ ట్వీట్ చేశాడు. మ‌రో విశేషం ఏమంటే ఇదేరోజు వెంక‌టేష్ న‌టించిన `మ‌ల్లీశ్వ‌రి` విడుద‌ల‌యి 17 ఏళ్ళ‌యింది. మంచి విజ‌యాన్ని సాధించి పెట్టిన న‌టీన‌టుల‌కు, సాంకేతిక సిబ్బందికి సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ట్విట్ట‌ర్‌లో కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసింది.