శనివారం, 25 మార్చి 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated: సోమవారం, 5 డిశెంబరు 2022 (16:23 IST)

త్వరలోనే మీర్జాపూర్ వెబ్ సిరీస్ సీజన్ స్ట్రీమింగ్

mirzapur
అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన "మీర్జాపూర్" వెబ్ సిరీస్ మన దేశంలోనే అతిపెద్ద విజయం సాధించింది. ఈ వెబ్ సిరీస్ అనేక రికార్డులను నెలకొల్పింది. తొలుత హిందీలో విడుదలైన ఈ వెబ్ సిరీస్ ఆ తర్వాత తెలుగు సహా అనేక ప్రాంతీయ భాషల్లో విడుదల చేసారు. ఈ వెబ్ సిరీస్ విడుదలైన అన్ని భాషల్లో విడుదలైన అన్ని భాషల్లో ఘన విజయం సాధించింది. ఇప్పటికే రెండు సీజన్‌లను ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. 
 
ముఖ్యంగా, గుడ్డూ పండిట్ పాత్రలో అలీ ఫజల్, మున్నా త్రిపాఠిగా దివ్యేంద్రు, అఖండానంద్ త్రిపాఠిగా పంకజ్ త్రిపాఠి అద్భుత నటన కనబరిచారు. ఈ పాత్రలను ప్రేక్షకులు అంత సులభంగా మరిచిపోలేరు. 
 
తన అన్ చెల్లిని చంపిన మున్నా త్రిపాఠిని గుడ్డూ పండిట్ చంపడంతో రెండో సీజన్ పూర్తవుతుంది. ఇపుడు మూడో సీజన్ కోసం ప్రేక్షకులు అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ త్వరలోనే విడుదల కానుంది.