గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

బాలీవుడ్‌లో విషాదం - మీర్జాపూర్ నటుడు కన్నుమూత

jitendra shastri
హిందీ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ సీనియర్ హిందీ నటుడు జితేంద్ర శాస్త్ర శుక్రవారం తుదిశ్వాస విడిచారు. అయితే, ఆయన ఎలా చనిపోయారో ఎవరికీ కారణాలు తెలియలేదు. పైగా, ఈ మరణ వార్తను ఆయన స్నేహితులు వెల్లడించడం వల్లే వెలుగులోకి వచ్చింది.
 
మీర్జాపూర్ అనే వెబ్ సిరీస్‌లో ఈయన ఉస్మాన్ అనే పాత్రలో నటించి మంచి పేరు గడించారు. ఒక్క చిత్ర పరిశ్రమకు మాత్రమే పరిమితం కాకుండా, నాటక రంగానికి కూడా సుపరిచితులే. ఈయన ఎన్నో నాటకాల్లో నటించారు. 
 
జితేంద్ర మృతిపై ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ మిశ్రా తన సంతాప సందేశాన్ని ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వెల్లడించారు. "నువ్వు లోకంలో లేవు. నీ మనసు మరియు హృదయజాలంలో ఎపుడూ ఉంటావు. ఓం శాంతి" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.