1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 14 అక్టోబరు 2022 (15:29 IST)

రణ్‌వీర్‌తో నా బంధం అన్యోన్యంగా సాగుతోంది : దీపిక పదుకొణె

deepika padukone
బాలీవుడ్ నటి దీపిక పదుకొణె తన విడాకులపై స్పందించారు. తన భర్త రణ్‌వీర్‌తో నా బంధం అన్యోన్యంగా సాగుతోంది అన్నారు. వ్యక్తిగత జీవితంలో మనస్పర్థలు తలెత్తడంతో.. వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారంటూ వార్తలు వచ్చాయి. వీటిపై ఆమె స్పందించారు. 
 
ఈ నేపథ్యంలో ఓ టాక్‌ షోలో పాల్గొన్న దీపిక.. ఈ వార్తలపై స్పందించారు. 'రణ్‌వీర్‌తో నా బంధం అన్యోన్యంగా సాగుతోంది. మ్యూజిక్‌ ఫెస్టివల్స్‌, కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం కోసం గత వారం ఆయన వేరే ప్రాంతాలకు వెళ్లాడు. పనులన్ని ముగించుకుని ఇప్పుడే ఇంటికి వచ్చాడు. నన్ను చూడగానే ఎంతో సంతోషించాడు' అని తెలిపారు. దీపిక స్పందనతో విడాకుల వార్తలకు ఫుల్‌స్టాప్‌ పడినట్లు అయ్యింది.
 
సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కించిన 'రామ్ లీలా' కోసం దీపికా పదుకొణె - రణ్‌వీర్‌ మొదటిసారి కలిసి పనిచేశారు. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇరు కుటుంబసభ్యుల అంగీకారంతో 2018లో ఈ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. వివాహం తర్వాత వీరిద్దరూ కలిసి ‘83’లో నటించారు.