1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By chitra
Last Updated : సోమవారం, 19 సెప్టెంబరు 2016 (13:13 IST)

షాహిద్ కపూర్ డాటర్ పేరేంటో తెలుసా.. ''మిషా''.. అమృతసర్ వెళ్ళి..

బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తండ్రి అయ్యాడు. గత ఏడాది షాహిద్ కపూర్-మీరా రాజ్ పుత్ వివాహం జరిగిన విషయం తెలిసిందే. ముంబైలోని హెల్త్ కేర్ హాస్పిటల్లో మీరా పండంటి పాపకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని షాహిద్ తన స

బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తండ్రి అయ్యాడు. గత ఏడాది షాహిద్ కపూర్-మీరా రాజ్ పుత్ వివాహం జరిగిన విషయం తెలిసిందే. ముంబైలోని హెల్త్ కేర్ హాస్పిటల్లో మీరా పండంటి పాపకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని షాహిద్ తన సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా తెలియజేసిన సంగతి విదితమే. 
 
కాగా తమ గారాల పట్టికి ఏం పేరు పెడుతున్నారు అదే దానిపై బాలీవుడ్ జనాలలో ఆసక్తి నెలకొంది. అయితే షాహిద్‌, మీరాలు పాపకి ఇద్దరి పేర్లలో మొదటి అక్షరాలు కలిసేలా ‘మిషా’ అని అందమైన పేరును పెట్టారు. ఈ దంపతులిద్దరూ తమ కుటుంబంతో కలిసి అమృత్‌సర్‌ వెళ్లి తమ గురువువద్ద పాపకి నామకరణ చేశారు.