సంబంధిత వార్తలు
చిరు వాయిస్ , మోహన్ బాబు యాక్షన్- నేను కసక్ అంటే.. మీరందరూ ఫసక్..?
Son of India
ఈ సినిమాను 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్స్‌పై మోహన్ బాబు స్వయంగా నిర్మిస్తున్నారు. మేస్ట్రో ఇళయరాజా సంగీత సారథ్యం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చాలా వరకూ పూర్తైంది.
మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్‌తో 'సన్ ఆఫ్ ఇండియా' టీజర్ మొదలవుతుంది. ఇందులో 'మన అంచనాలకు అందని ఒక వ్యక్తిని ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను. తన రూటే సపరేటు.. తను ఎప్పుడు? ఎక్కడ? ఏ వేషంలో ఉంటాడో ఆ దేవుడికే ఎరుక. తన బ్రెయిన్‌లో ఎప్పుడు ఎలాంటి ఆలోచన పుడుతుందో ఏ న్యూమరాలజిస్టూ చెప్పలేడు' అంటూ ఇంట్రడక్షన్ ఇచ్చారు. ఆ తర్వాత మోహన్ బాబు కూడా తనదైన శైలి డైలాగులతో రచ్చ రచ్చ చేశారు. చివర్లో 'నేను కసక్ అంటే.. మీరందరూ ఫసక్' అని చెప్పే డైలాగ్ మరింతగా ఆకట్టుకుంది.
