కొన్ని సినిమాలు ఎందుకు ఆడవో తెలీదంటున్న సినీపెద్దలు
రైతే దేశానికి వెన్నెముక. రైతు లేనిదే ప్రజలు లేరు, పాలకులు లేరు. అంటూ ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా వినేనాథుడేలేడు. అందులోనూ ఢిల్లిలో రైతులు ఎన్ని రోజులుగా తమకు న్యాయం జరగాలని పోరాడుతున్నా పట్టించుకున్న పాలకులు లేరు. సరిగ్గా సినిమాలు కూడా అలానే వున్నాయని ఛాంబర్ కార్యదర్శి ప్రసన్నకుమార్ తెలియజేస్తున్నారు. ఆరుగాలం దుక్కి దున్ని నాట్లువేసి ఎండనక వాననక కష్టపడే రైతుకు సమస్యలు వుంటే దీనిపై ఎన్నో చిత్రాలు వచ్చాయి. రైతేరాజు, పాడిపంటలు, రైతుబిడ్డ నుంచి నేటి శ్రీకారం వరకు సినిమాలు వచ్చాయి. ఏవీ రికార్డ్‌లు బద్దలు కొట్టలేదు. కొన్ని సినిమాలో కథే వుండదు. కానీ జనాలు తెగ చూసేస్తుంటారు. కొన్ని సినిమాల్లో కథ వుంటుంది. అన్నీ బాగుంటాయి. కానీ ఆదరింరు. రెండోదే శ్రీకారం. శర్వానంద్ నటించిన శ్రీకారం సినిమా తీయడానికి ముందుకు వచ్చిన ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాతలని అభినందించాలి. కానీ సినిమాను చూసే జనాలు థియేటర్‌కు తగ్గారు. మంచి సినిమాలు రావాలి. వస్తేనే కానీ సినిమారంగం బాగుపడదు అంటుంటారు. అందుకే మంచి సినిమాలు తీస్తుంటారు కొందరు. కొన్ని సినిమాలకు మంచి టాక్ వస్తుంది. మంచి సినిమా అన్న పేరొస్తుంది. రివ్యూలు బాగుంటాయి. సోషల్ మీడియాలో జనాలందూ సినిమా గురించి పాజిటివ్‌గానే మాట్లాడతారు. అయినా సరే.. జనాలు వాటిని ఆశించిన స్థాయిలో ఆదరించరు. వ్యవసాయం చుట్టూ నడిచే ఈ సినిమాలో మంచి సందేశం ఉంది. దాన్ని చాలా హృద్యంగా చెప్పారు. కమర్షియల్ హంగులు కూడా బాగానే జోడించారు. అన్నీ బాగున్నా కానీ సినిమాకు వసూళ్లు మాత్రం లేవు.
కానీ అదే సమయంలో జాతిరత్నాలు అనే సినిమా రావడం. లాజిక్‌లేని కామెడీని అందరూ మెచ్చుకోవడంతో శ్రీకారం కు ఎదురు దెబ్బ తగిలింది. మంచి ఎంటర్టైనర్ అయిన ఆ సినిమా చూడ్డానికే ప్రేక్షకులు ఎగబడుతున్నారు. వీకెండ్లోనే శ్రీకారంకు సరైన వసూలూ లేకపోయింది. శని, ఆదివారాల్లో థియేటర్ల నిండలేదు. దాంతో ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు మింగుడు పడలేదు. దాదాపు ఇప్పటివవరకు శ్రీకారం 10కోట్లకు రాబట్టకలిగింది. కానీ ఇంకా ఇంకా 8 కోట్లు వస్తేనే వారు గట్టెక్కేది. కానీ అలా వచ్చే అవకాశం కనిపించడంలేదు. ఎందుకంటే మరలా వారంలరోజుల్లో మరికొన్ని కొత్త సినిమాలు వస్తున్నాయి. దాంతో థియేటర్లు తగ్గిపోతున్నాయి. అందుకే అంటుంటారు కొన్ని ఎందుకు ఆడుతుంటాయో తెలీదు. మరికొన్ని ఎందుకు ఆడవో తెలీదు అని. అది శ్రీకారం విషయంలో జరిగింది.