మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: శనివారం, 24 సెప్టెంబరు 2016 (19:19 IST)

ధోని కర్మయోగి... కప్ పక్కవారికి ఇచ్చి నిలబడ్డారు...: రాజమౌళి

మహేందర్‌ సింగ్‌ ధోని.. కర్మయోగి. అలాంటి వ్యక్తులు తక్కువ. 1993లో వరల్డ్‌ కప్‌ను ఆయన నేతృత్వంలో గెలుచుకున్నాక.. కప్‌ను పక్కనవారికిచ్చి తను కామ్‌గా నిలుచున్నాడు. అందుకే కర్మయోగి అని ధోనినే అనాలి.. అని దర్శకుడు రాజమౌళి ప్రశంసించారు. ధోని జీవిత చరిత్ర ఆధ

మహేందర్‌ సింగ్‌ ధోని.. కర్మయోగి. అలాంటి వ్యక్తులు తక్కువ. 1993లో వరల్డ్‌ కప్‌ను ఆయన నేతృత్వంలో గెలుచుకున్నాక.. కప్‌ను పక్కనవారికిచ్చి తను కామ్‌గా నిలుచున్నాడు. అందుకే కర్మయోగి అని ధోనినే అనాలి.. అని దర్శకుడు రాజమౌళి ప్రశంసించారు. ధోని జీవిత చరిత్ర ఆధారంగా 'ఎం.ఎస్‌. ధోని' ద అన్‌టోల్డ్‌ సోరీ.. అనే పేరుతో బాలీవుడ్‌లో సినిమా రూపొందుతోంది. ఫ్యాక్స్‌స్టార్‌ స్టూడియో, అరుణ్‌ పాండే నిర్మిస్తున్నారు. నీరజ్‌పాండే దర్శకత్వం వహించారు. 
 
తమిళ వెర్షన్‌ పాటలను చెన్నైలో శుక్రవారం విడుదల చేయగా, తెలుగు వెర్షన్‌ పాటలను శనివారం జూబ్లీహిల్స్‌లోని జెఆర్‌సి ఫంక్షన్‌ హాల్‌లో విడుదల చేశారు. దీనికి ముఖ్య అతిథిగా రాజమౌళి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 1980 నుంచి కపిల్‌ దేవ్‌, రవిశాస్త్రి, ధోని క్రికెట్‌ చూసి ఎంజాయ్‌ చేశాను. గెలిస్తే గంతులేసేవాళ్ళం. ఓడితే బాధపడేవాళ్ళం. కానీ.. ధోని వచ్చాక.. ఆ బాధ పోయింది అని చెప్పారు.
 
ధోని మాట్లాడుతూ... ఈ కథ నా జీవితానికి దగ్గరగా వుంది. నా జీవిత చరిత్రను సినిమాగా తీస్తానంటే అనుమతిచ్చాను. చదవుతోపాటు క్రికెట్‌ కూడా బ్యాలెన్స్‌ చేసుకుని నేర్చుకున్నాను. చదువు అశ్రద్ధ చేయలేదు. క్రికెట్‌ అంటే ఎంతో ప్రేమ. గల్లీ స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదిగాను. రాజమౌళి అంటే ఇష్టం. 'బాహుబలి' చూశాను. ఇప్పుడు సీక్వెల్‌ చేస్తున్నాడు అని తెలిపారు. కాగా, ధోనీ చిత్రాన్ని ఒకేసారి నాలుగు భాషల్లో ఈ నెల 30న విడుదల చేస్తున్నారు.