1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : శనివారం, 4 నవంబరు 2023 (09:22 IST)

కురచ దుస్తులు వేసుకున్నందుకు అరెస్టు చేశారంటూ నటి ఫేక్ వీడియో.. కేసు

uorfi javed
కురచ దుస్తులు వేసుకున్నందుకు తనను అరెస్టు చేసినట్టి నటి ఉర్ఫీ జావెద్ ఓ ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కేవలం ప్రచారం కోసం ఇలా నడుచుకున్నారు. దీనిపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెకు తగిన శాస్తి చేశారు. అరెస్టు చేసినట్టుగా ఫేక్ వీడియో షేర్ చేసినందుకు ఆమెపై కేసు నమోదు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తాను అరెస్టయినట్టు ఫేక్ వీడియో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యవహారంలో పోలీసులను సైతం దిగ్భ్రాంతికి గురిచేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఉర్ఫీ జావెద్‌ను శుక్రవారం కేసు నమోదు చేశారు. ఈ వైరల్ వీడియోలో కొందరు మహిళలు పోలీసు దుస్తుల్లో వచ్చి ఓ కేఫ్ వద్ద ఉన్న ఉర్ఫీ జావేద్‌న్ను అరెస్టు చేసినట్టు చూపించారు. కురచ దుస్తులు వేసుకుని వీధుల్లో తిరుగుతున్నట్టు, అరెస్టు చేస్తున్నట్టు వారు చెప్పడం కనిపించింది.
 
ఈ వీడియో కలకలం రేపడంతో ముంబై డీసీపీ స్వయంగా స్పందించి ఉర్ఫీని అరెస్టు చేయలేదని ప్రకటించాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఉర్ఫీతో పాటూ మరికొందరిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ప్రభుత్వ అధికారుల చిహ్నాలను దుర్వినియోగ పరచడం, మోసం తదితర అభియోగాలపై కేసు నమోదు చేశారు. కాగా, గతంలోనూ ఉర్ఫీ చట్ట ఉల్లంఘనలకు పాల్పడింది. బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకర చర్యలకు దిగినందుకు గతేడాది డిసెంబర్లో అంధేరీ పోలీస్ స్టేషనులో ఉర్ఫీపై కేసు నమోదైంది.