సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 29 జులై 2022 (20:02 IST)

సింగర్ సునీత శ్రావణ శుక్రవారం పూజ.. (Video)

Sunitha
ప్రముఖ గాయని సునీత ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుంటాయి. గాత్రంతోనే గాకుండా సౌమ్యంగా, సంప్రదాయంగా వుంటూ.. సోషల్ మీడియాలో యాక్టివ్‌‌గా వుండే సునీత నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటున్నారు. తన జీవితంలోని మనోహరమైన క్షణాలను సోషల్ మీడియాలో పంచుకోవడానికి ఇష్టపడుతుంది.
 
ఇక తాజాగా శ్రావణ శుక్రవారం సందర్భంగా గాయని సునీత తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఒక వీడియోను పంచుకున్నారు, దీనిలో ఆమె లక్ష్మీ దేవతకు ప్రార్థనలు చేయడం, హారతి పాట పాడటం ఈ వీడియోలో చూడవచ్చు. ఇంకా తన పోస్ట్‌కి "మా అమ్మ నా జీవితాన్ని చాలా దైవికంగా, అందంగా మార్చింది.." అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.