1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 19 ఏప్రియల్ 2025 (12:14 IST)

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

Tanikella Bharani
తనికెళ్ల భరణి. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, రచయితగా, దర్శకుడిగా ఆయన తనేమిటో నిరూపించుకున్నారు. శివతత్వం గురించి ఆయన ఆలపించే గీతాలు పాపులర్. సినిమాల్లో నటించే సమయంలో తన ఇద్దరు పిల్లలతో గడిపే సమయం దొరికేది కాదని చెప్పారు. ముఖ్యంగా తన ఇద్దరి పిల్లల బాల్యంలో వారితో నేను ఉండే సమయం దొరికేది కాదని అన్నారు.
 
ఓరోజు తన భార్య ఎంతో ఆదుర్దాగా... నా కుమార్తె కిరోసిన్ తాగిందని ఫోన్ చేసింది. దాంతో నేను ఎంతో కంగారుపడ్డాను. కాలూచేయీ ఆడలేదు. పాపకు రెండేళ్లు. షూటింగ్ స్పాట్ నుంచి వెంటనే ఇంటికి వెళ్లిపోదామని అనుకుంటూ వుండగా, మా ఇంటి మీదుగా వెళ్తున్న ఓ అసిస్టెంట్ డైరెక్టర్ విషయం తెలుసుకుని పాపకి వైద్యం చేయించారు. ఆమె ఆరోగ్యం కుదుటపడింది. ఆ తర్వాత మా అమ్మాయిని ఇంటికెళ్లి చూసేంతవరకూ నా ఆదుర్దా తగ్గలేదు అంటూ చెప్పారు తనికెళ్ల భరణి.