గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 17 ఫిబ్రవరి 2024 (15:31 IST)

మైరా లాంటి సినిమా అవసరం- పాన్ ఇండియాగా చేయండి : రామానుజ జీయర్ స్వామి

Tridandi Devanatha Ramanuja Jeeyar Swami, Smile Srinu
Tridandi Devanatha Ramanuja Jeeyar Swami, Smile Srinu
కన్నడ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్మైల్ శ్రీను దర్శకత్వంలో తెలుగులో డైరెక్ట్ గా వస్తున్న పాన్ ఇండియా చిత్రం '' మైరా'' ఈ చిత్ర దర్శకుడు స్మైల్ శ్రీను  పరమహంస పరివ్రాజాకాచర్య, ఉభయ వేదాంతప్రవర్తకాచార్య, శ్రీ శ్రీ శ్రీ త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి వారిని కలిసి మైరా చిత్ర స్క్రిప్ట్ పూజా చేయించి స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు

ఈ సందర్భంగా  శ్రీ శ్రీ త్రిదండి చిన్న జియర్ స్వామి వారు మాట్లాడుతూ. "మైరా" లాంటి చిత్రాలు ఇప్పటి సమాజానికి చాల అవసరం  ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తు పర్యావరణాన్ని నాశనం చేస్తున్న ప్రస్తుత సమాజానికి ఈ చిత్రం  ఎంతగానో ఉపయోగపడే సినిమా "మైరా" అవుతుంది అని అనిపిస్తుంది,  ఈ చిత్రాన్ని తెలుగు కన్నడ భాషల్లో మాత్రమే కాకుండా అన్ని భాషల్లో పాన్ ఇండియా సినిమా గా తియ్యండి ఇటువంటి మంచి చిత్రానికి నా ఆశిష్యూలు సపోర్ట్ ఉంటుంది అని చెప్పారు.
 
ఈ చిత్ర దర్శకుడు స్మైల్ శ్రీను మాట్లాడుతూ. శ్రీ శ్రీ త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి వారికి నా పాదాభి వందనం స్వామి ఆశిష్యూలు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈ అవకాశం కల్పించిన అనంత లక్ష్మి అక్క గారికి కృతజ్ఞతలు.  స్వామి వారికి "మైరా" మూవీ డైరెక్ట్ తెలుగు చిత్రీకరించి కన్నడంలో డబ్ చేస్తాము అని చెప్పి "మైరా" కథ ఎలా ఉంటుందో చెప్పగానే కథకు కొన్ని సలహాలు చూచనలు ఇచ్చి  ప్రకృతికి విరుద్ధంగా ఉంటూ జీవితాలను నాశనం చేసుకుంటున్న ఇప్పటి సమాజానికి "మైరా" లాంటి సినిమా అవసరం, ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో పాన్ ఇండియా సినిమా గా చేయండి" "మైరా" మూవీ కి నా ఆశిష్యూలు సపోర్ట్ ఉంటాయి ఏ అవసరం ఉన్నా నాతో చెప్పండి అని అనడం మా చిత్ర యూనిట్ కి మరింత ధైర్యన్ని ఇచ్చింది.  మేము చేస్తున్న ఈ చిత్రానికి తెలుగులో ఒక స్టార్ హీరోయిన్ తో చేయడానికి ప్లాన్ చేస్తున్నాం మరిన్ని వివరాలు అతి త్వరలో తెలియజేస్తామని దర్శకుడు తెలిపారు.