బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 17 ఫిబ్రవరి 2024 (13:42 IST)

రాకింగ్ స్టార్ యష్ తన భార్య రాధిక కోసం చిన్న కిరాణా దుకాణం వెళ్ళాడు

Yash at kirana shop
Yash at kirana shop
కన్నడ, తెలుగు రాకింగ్ స్టార్ యష్ కెజిఎఫ్. వంటి సినిమాతో ఒక్కసారిగా భారత్ మొత్తం తెలిసిన హీరోగా మారిపోయాడు. అయితే ఆయన రోజువారీ యాక్టివిటీస్ కూడా చాలా సింపుల్ గా వుంటాయి. ఒక దశలో హీరో విజయ్ దేవరకొండ కూడా తనుంటున్న వీధిలో చిన్న కుర్రాళ్ళతో క్రికెట్ ఆడి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. ఇప్పుడు కన్నడ స్టార్ యష్ కూడా తన భార్య రాధిక కోసం చిన్న కిరాణా దుకాణం వెళ్ళాడు. అక్కడ ఐస్ క్యాండీని కొనుగోలు చేశాడు. భారీ స్టార్‌డమ్ ఉన్నప్పటికీ,  యష్ సింపుల్‌గా మరియు వినయంగా ఉంటాడని సోషల్ మీడియాలో ఆయన అభిమానులు వైరల్ చేస్తున్నారు.
                                                               
షిరాలీలోని భత్కల్‌ దగ్గర చిత్రపుర మఠం ఆలయాన్ని వారు ఇటీవల సందర్శించిన సందర్భంగా ఇది జరిగింది. యష్ అతని భార్య రాధికాపండిత్ వారి అభిమానులతో కలిసి ఉన్న చిత్రాలు కూడా ఉన్నాయి. నివేదికల ప్రకారం, యష్, అతని కుటుంబం షిరాలీలోని శ్రీ చిరాపూర్ మఠం ఆలయాన్ని సందర్శించారు.