శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 6 డిశెంబరు 2023 (12:31 IST)

యష్ 19వ సినిమా.. హీరోయిన్‌గా సాయిపల్లవి.. హైప్ మామూలుగా..

KGFChapter2Teaser
యష్ 19వ సినిమా డిసెంబర్ 8న ప్రారంభం కానుంది. గోవా డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతున్నట్లు సమాచారం. ఇది సెమీ పీరియాడికల్ డ్రామా అవుతుంది.
 
ఈ చిత్రానికి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో సాయి పల్లవి కూడా నటిస్తుందని టాక్. యష్, సాయి పల్లవిల క్రేజీ కాంబినేషన్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కెవిఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రానికి చరణ్ రాజ్ సంగీతం అందించనున్నారు. 
 
కేజీఎఫ్-2 తర్వాత, యష్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ప్రస్తుతం యష్ 19వ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇందుకు తోడు సాయిపల్లవి కూడా యష్‌కు హీరోయిన్‌గా నటించడం సినిమా హైప్‌ను పెంచేసింది. 
Sai Pallavi
Sai Pallavi
 
సాయిపల్లవి ప్రస్తుతం నాగ చైతన్య సరసన నటిస్తోంది. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవలే ప్రకటించారు. మరోవైపు, నితీష్ తివారీ దర్శకత్వం వహించబోతున్న రామాయణంలో యష్ రావణుడి పాత్రను పోషిస్తారని తెలుస్తోంది.