శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 29 నవంబరు 2023 (13:59 IST)

ఒక్కో సినిమాకు రూ.3కోట్లు డిమాండ్ చేస్తోన్న సాయిపల్లవి?

saipallavi
ప్రేమమ్ సినిమాలోని మలర్ మిస్ రోల్ నటి సాయి పల్లవి కెరీర్‌లో పెద్ద మలుపు. తర్వాత సాయిపల్లవి సెలెక్టివ్ రోల్స్ ఎంచుకుంటుంది. ఇంకా సినిమాల్లో నటించేందుకు టేకప్ చేయాలంటే చాలా కఠినమైన షరతులు పెడుతుంది.
 
తాజాగా సాయిపల్లవి పారితోషికం ట్రెండింగ్‌గా మారింది. ఈ నటి కేవలం ఒక్క సినిమాకే కోట్ల పారితోషికం తీసుకుంటుంది.
 
సాయిపల్లవి గత ఏడాది విరాటపర్వం, గార్గి అనే రెండు చిత్రాల్లో కనిపించింది. తాజాగా చందు మొండేటి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించే చిత్రంలో సాయిపల్లవి నటిస్తోంది. ఈ సినిమాలో నాగ చైతన్య మత్స్యకారుడిగా నటిస్తున్నాడు. 
 
ఇందులో సాయి పల్లవి కథానాయిక. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం సాయి పల్లవికి భారీ పారితోషికం ఇస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకే కాదు.. కొత్త సినిమాల్లో సాయిపల్లవి సైన్ చేయాలంటే.. రూ.3కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.