శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శనివారం, 2 ఫిబ్రవరి 2019 (22:24 IST)

ఇస్మార్ట్ శంక‌ర్‌లో మ‌రో ఫ్లాప్ హీరోయిన్..!

డేరింగ్ & డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కిస్తోన్న తాజా చిత్రం ఇస్మార్ట్ శంక‌ర్. ఎన‌ర్జిటిక్ హీరో రామ్ న‌టిస్తోన్న ఈ మూవీని పూరి - ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రామ్ స‌ర‌స‌న స‌వ్య‌సాచి, మిస్ట‌ర్ మ‌జ్ను చిత్రాల క‌థానాయిక నిధి అగ‌ర్వాల్‌ను సెలెక్ట్ చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా మరో హీరోయిన్‌ని ఎనౌన్స్ చేసారు. ఆమె ఎవ‌రో కాదు న‌భా న‌టేష్. నన్ను దోచుకుందువటే సినిమాతో నభా నటేష్ కథానాయికగా పరిచయమైంది.
 
తొలి సినిమాతోనే ఈ అమ్మాయి బాగానే ఉంద‌నిపించుకున్నా ఆ సినిమాతో క‌మ‌ర్షియ‌ల్ స‌క్స‌స్ మాత్రం సాధించ‌లేక‌పోయింది. దీంతో ఆశించిన స్థాయిలో ఈ అమ్మాయికి అవకాశాలు రాలేదు. ఇప్పుడు పూరి ఇస్మార్ట్ శంక‌ర్‌లో ఛాన్స్ ద‌క్కించుకుంది. 
 
ప్ర‌స్తుతం యాక్ష‌న్ సీన్స్ చిత్రీక‌రిస్తున్నారు. త్వ‌ర‌లోనే నిధి అగ‌ర్వాల్, న‌భా న‌టేష్ షూటింగ్‌లో జాయిన్ కానున్నారు. పూరి హిట్టు, ఫ్లాప్స్‌ని ప‌ట్టించుకోకుండా ఇలా ఫ్లాప్ హీరోయిన్స్ అవ‌కాశం ఇవ్వ‌డం ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.