బుధవారం, 29 నవంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 21 సెప్టెంబరు 2023 (17:45 IST)

నా సామిరంగా లుక్‌ను బయటపెట్టిన నాగార్జున

naa Samiranga look
naa Samiranga look
అక్కినేని నాగార్జున తాజాగా చేస్తున్న సినిమా నా సామిరంగా. కొత్త దర్శకుడు విజయ్ బిన్నీ పరిచయం కాబోతున్నాడు. చిట్టూరి శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.ఇటీవలే తన బర్త్‌డే నాడు స్మోక్‌ చేస్తూ గడ్డెంతో రఫ్‌ లుక్‌తో దర్శనమిచ్చాడు. ఇక ఈరోజు కలర్‌ఫుల్‌ డ్రెస్‌తో జేబులో చేయిపెట్టుకుని కొత్త లుక్‌ ఇచ్చాడు. ఈ సినిమా పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా వుండబోతుందని సమాచారం. ఓ మళయాళ సినిమాకు రీమేక్‌ అనే వార్తలు వినిపించాయి. 2019లో రిలీజ్ అయిన ‘పోరింజు మరియం జోస్ కు రీమేక్. అయితే దాన్ని ఇంతవరకు చిత్ర యూనిట్‌ ధృవీకరించలేదు.
 
ఈ సినిమా గురించి పూర్తి వివరాలు విడుదల చేయపోయినా విడుదల వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల ప్రకటించారు. ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్న ఈ సినిమా నాగ్‌ అభిమానులు ఎంతో ఎగ్జైట్‌తో ఉన్నారు. ఇంతకుముందు వచ్చిన ఘోస్ట్‌ చిత్రం వారిని నిరాశపరిచింది. ఆ తర్వాత చాలా గేప్‌ తీసుకున్న నాగార్జున రీమేక్‌ చేస్తున్నాడని తెలుస్తోంది.