మంగళవారం, 21 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 27 ఆగస్టు 2021 (11:42 IST)

వర్షంలో కత్తిని పట్టుకుని.. యాక్షన్ మూడ్‌లో నాగ్ పోస్టర్

Nagarjuna
కింగ్ నాగార్జున ప్రస్తుతం  ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ని చేస్తున్న సంగతి తెలిసిందే. గ‌త కొద్ది రోజులుగాఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది.
 
ఈ రోజు చిత్రం నుంచి ఒక మాస్ అనౌన్సమెంట్,  ప్రీ లుక్ పోస్టర్ బయటకి వచ్చింది. వర్షంలో కత్తిని పట్టుకొని ఉన్న నాగ్ యాక్ష‌న్ మూడ్‌లో ఉన్న‌ట్టు పోస్ట‌ర్‌ని చూస్తుంటే అర్థమ‌వుతుంది. ఈ చిత్రాన్ని హాలీవుడ్ లెవెల్ ప్రమాణాలతో అత్యున్నత స్థాయిలో తెరకెక్కిస్తున్నట్టుగా అర్ధం అవుతుంది.
 
ఈ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ గోవాలో పూర్తైంది. రెండో షెడ్యూల్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతుంది. ఇందులో నాగార్జున ఔట్‌ అండ్‌ ఔట్‌ యాక్షన్‌ ప్యాక్‌ రోల్‌లో కనిపించనున్నారు. 
 
భారత్‌లోని ప్రధాన నగరాలు, విదేశాల్లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్లాన్ చేశాయి చిత్ర అగ‌ర్వాల్‌. కాజల్‌ అగర్వాల్ క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా, నారాయణ్‌దాస్‌ కె. నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహనరావు, శరత్‌ మరార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.