మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 6 అక్టోబరు 2017 (14:06 IST)

సమంతకు సర్‌ప్రైజ్ గిఫ్ట్.. ఏంటదో తెలుసా?

''ఏ మాయ చేసావె'' సినిమా ద్వారా పరిచయమైన...ఆపై ప్రేమ పక్షులుగా మారి.. ప్రస్తుతం పెళ్లిపీటలెక్కనున్న సమంత, నాగచైతన్యలకు వివాహ వేదికపై స్పెషల్ సర్‌ప్రైజ్ రెడీ అవుతోంది. శుక్రవారం గోవాలో నిరాడంబరంగా చైతూ,

''ఏ మాయ చేసావె'' సినిమా ద్వారా పరిచయమైన...ఆపై ప్రేమ పక్షులుగా మారి.. ప్రస్తుతం పెళ్లిపీటలెక్కనున్న సమంత, నాగచైతన్యలకు వివాహ వేదికపై స్పెషల్ సర్‌ప్రైజ్ రెడీ అవుతోంది. శుక్రవారం గోవాలో నిరాడంబరంగా చైతూ, సమ్మూ వివాహం జరుగనుంది. ఈ నేఫథ్యంలో అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీ మొత్తం కలసి సమంతకు వెల్ కమ్ చెబుతూ ఓ చిన్న వీడియోను రూపొందించారు. 
 
వివాహం జరుగుతున్నప్పుడు ప్రదర్శించేందుకు ఈ వీడియోను రూపొందించారని, దీని గురించి సమంత, చైతూలకు తెలియదని సమాచారం. సమంతకు సర్‌ప్రైజ్‌గా ఈ వీడియోను కానుకగా ఇవ్వాలని భావించిన రెండు ఫ్యామిలీలూ ఆమెకు స్వాగతం చెబుతూ కనిపిస్తాయట. ఈ వీడియోలో అక్కినేని నాగార్జున, అమల, అఖిల్‌తో పాటు రానా, సుమంత్ ఇందులో కనిపిస్తారని సమాచారం.
 
ఈ వీడియో సమంతకు స్వీట్ షాకింగ్‌గా వుంటుందని వారి కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. అలాగే నాగార్జున కూడా సమ్మూ-చైతూ కోసం అన్నపూర్ణ స్టూడియోలో కొత్త కాటేజీ కట్టిస్తున్నారని.. ఇందులో అత్యాధునిక పరికరాలు.. విదేశీ వస్తువులను వుంచినట్లు తెలుస్తోంది.
 
ఇక ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా చైతూ జంటకు శుభాభినందనలు చెబుతూ కామెంట్ల వరద పారిస్తున్నారు. 'ఏమాయ చేశావే' దర్శకుడు గౌతమ్ మీనన్ ను ప్రస్తావిస్తుండటం విశేషం. వీరిద్దరి ప్రేమకు బీజం వేసింది గౌతమేనని, ఆయన ఫోటోను పూజ గదిలో పెట్టుకుని జీవితాంతం పూజించుకోవాలని సలహాలు కూడా ఇస్తున్నారు.