''నగ్నం'' హీరోయిన్‌కు బంపర్ ఆఫర్.. బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి ఎంట్రీ!? (video)

SreeRapaka
సెల్వి| Last Updated: శుక్రవారం, 10 జులై 2020 (19:51 IST)
SreeRapaka
బిగ్ బాస్ మూడో సీజన్ విన్నర్‌గా రాహుల్ సిప్లగింజ్ నిలిచిన సంగతి తెలిసిందే. త్వరలో బిగ్ బాస్ నాలుగో సీజన్ జరుగనుందని టాక్. త్వరలోనే ప్రారంభం కానున్న ఈ రియాల్టీ షో పై ప్రేక్షకులు చాలా అంచనాలను పెట్టుకున్నారు. మొదటి సీజన్‌లో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా అదరగొట్టేయగా రెండో సీజన్‌లో న్యాచురల్ స్టార్ నాని మంచి మార్కులు కొట్టేశాడు.

ఇక మూడవ సీజన్ హోస్ట్‌గా వ్యవహరించిన నాగార్జున దీన్ని విజయవంతం చేశారు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజ‌న్ 4 సీజన్ హోస్ట్‌‍పై ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ హోస్ట్ రేసుకు సంబంధించి రోజుకో పేరు వినిపిస్తుంది. అలాగే బిగ్ బాస్‌లో పాల్గొనే కంటిస్టెంట్లకు సంబంధించి రోజుకో పేరు వెలుగులోకి వస్తోంది.

ఈసారి బిగ్ బాస్ హౌస్‌లోకి రామ్ గోపాల్ వర్మ రూపొందించిన ''నగ్నం'' చిత్రంలోని హీరోయిన్ శ్రీ రాపాక వెళ్లబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈమెను బిగ్ బాస్ నిర్వాహకులు కలిసినట్టు కూడా సమాచారం. మరి ఇందులో వాస్తవం ఎంతుందో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

దీనిపై మరింత చదవండి :