శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 29 జూన్ 2020 (19:42 IST)

ఆర్జీవీ సంచలన ప్రకటన : పవర్ స్టార్ బయోపిక్ నిర్మిస్తా (video)

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ సంచలన ప్రకటన చేశారు. తాజాగా ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బయోపిక్ నిర్మించనున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే, ఆయన రక్త చరిత్ర, లక్ష్మీస్ ఎన్టీఆర్ వంటి పలు సినిమాలను నిజజీవిత కథల ఆధారంగా తీసిన విషయం తెలిసిందే. 
 
ఇపుడు తాజాగా 'బ్రేకింగ్‌ న్యూస్‌... ఆర్జీవీ వరల్డ్ థియేటర్‌లో నేను తీస్తున్న నా తదుపరి సినిమాకు పవర్ స్టార్‌ అని పేరు పెట్టాను. ఇందులో పీకే, ఎమ్మెస్, ఎన్‌బీ, టీఎస్‌, ఓ రష్యన్ మహిళ, నలుగురు పిల్లలు, ఎనిమిది బర్రెలు, ఆర్జీవీ నటిస్తారు. పవర్‌ స్టార్‌ సినిమాలో ఆ పాత్రల పేర్లను అర్థం చేసుకున్న వారికి బహుమతులు మాత్రం ఇవ్వను' అంటూ ప్రకటన చేశారు.
 
దీంతో పవన్ కల్యాణ్‌ అభిమానులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇది పవన్ కల్యాణ్‌ బయోపిక్ కదా? అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. పీకే అంటే పవన్ కల్యాణ్‌, ఎమ్మెస్ అంటే మెగాస్టార్‌, ఎన్‌బీ అంటే నాగబాబు, టీఎస్‌ అంటూ త్రివిక్రమ్ శ్రీనివాస్‌ అంటే కామెంట్లు చేస్తున్నారు.
 
కాగా, ప్రస్తుతం మారుతీ రావు, అమృత, ప్రణయ్ ప్రేమకథ, హత్యల సంఘటనలను ఆధారంగా చేసుకుని మర్డర్ పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. దీనిపై అమృత ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసింది కూడా. అయినప్పటికీ ఆర్జీవీ ఏమాత్రం పట్టించుకోకుండా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.