అవన్నీ వట్టి గాలి వార్తలే... కొట్టిపడేసిన మహేష్ భార్య నమ్రత
తను తీరిక లేకుండా తన భర్త, పిల్లల బాధ్యతలను చూసుకుంటూ వుంటే తనేదో సినిమాలో నటించబోతున్నానంటూ మీడియాలో వార్తలు రావడంపై నమ్రతా శిరోద్కర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అసలు తనకు అలాంటి ఆలోచన లేకపోయినా మీడియా ఇలాంటి వార్తలను ఎలా సృష్టిస్తుందోనని అన్నారు.

తనకు సంబంధించిన వరకూ తను తన భర్త మహేష్ బాబు డేట్స్ చూసుకోవడం, పిల్లలను చూసుకోవడంతోనే సరిపోతుందని అన్నారు. అలాంటప్పుడు ఇక నటించే ఛాన్స్ ఎక్కడ వుందంటూ చెప్పుకొచ్చారు.