శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 అక్టోబరు 2021 (12:32 IST)

మహేష్ ఫ్యామిలీ కూడా అక్కడే ట్రిప్ ఎంజాయ్

సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆమె తరచుగా వారికి సంబంధించిన ఫోటోలను, పలు అప్డేట్లను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. 
 
తాజాగా నమ్రత పిల్లలతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేయగా, అది వైరల్ అవుతోంది. ప్రస్తుతం మహేష్ బాబు 'సర్కారు వారి పాట' షూటింగ్‌లో బిజీగా ఉన్నారన్న విషయం తెలిసిందే. బార్సిలోనాలో ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను రూపొందిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో మహేష్ ఫ్యామిలీ కూడా అక్కడే ట్రిప్ ఎంజాయ్ చేస్తోంది. నమ్రత శిరోద్కర్ తన పిల్లలు గౌతమ్, సితారతో కలిసి అక్కడే ఒక ప్రసిద్ధ పార్కును సందర్శించారు. పిల్లలతో నమ్రత బార్సిలోనాలోని ప్రసిద్ధ పార్క్ గుయెల్‌ని సందర్శించింది. 
 
'పార్క్‌గ్వెల్ చాలా ఎదురు చూస్తున్న యాత్ర, మేధావి గౌడి అద్భుతమైన నిర్మాణం మనోహరంగా ఉంది. #బార్సిలోనా' అంటూ ఆమె తన పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చింది.