గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: విజయవాడ , శనివారం, 25 సెప్టెంబరు 2021 (15:51 IST)

మొన్న‌టి వ‌ర‌కు మిల్క్ బ్యూటీ త‌మ‌న్నా... నేడు మిల్క్ బాయ్ మ‌హేష్

టాలీవుడ్ మిల్క్ బాయ్ మహేశ్ బాబు బిగ్ సి మొబైల్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు బిగ్ సి సంస్థ మహేశ్ బాబుతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇకపై బిగ్ సి ప్రచారకర్తగా మహేశ్ బాబు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాగా, బిగ్ సి సంస్థకు ఇప్పటివరకు అంబాసిడర్లుగా వ్యవహరించింది కేవ‌లం హీరోయిన్లే. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు మిల్క్ బ్యూటీ త‌మ‌న్నా దీనికి బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఉన్నారు. గ‌తంలో ర‌కుల్, పూజా హెగ్డే, రెజీనాలు బిగ్ సి కోసం ప‌నిచేశారు. ఇపుడు హీరోయిన్లు కాకుండా, ఇప్పుడు మహేశ్ బాబు రూపంలో తొలిసారిగా ఓ హీరో బిగ్ సి సంస్థకు అంబాసిడర్ గా నియమితులయ్యారు.

ఇదే ప్రశ్నను ఓ మీడియా ప్రతినిధి మహేశ్ బాబును ప్రశ్నించగా, బిగ్ సి అంబాసిడర్ స్థానాన్ని మహిళల నుంచి కొట్టేశానని భావించడం లేదంటూ చమత్కరించారు. బిగ్ సితో కలిసి నడవనుండడం తనకు లభించిన గౌరవంగా భావిస్తానని తెలిపారు.