శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 18 ఏప్రియల్ 2021 (14:30 IST)

కేంద్ర ఉద్యోగుల‌కు జూలై నుంచి డీఏ పెంపు..!

కేంద్ర ప్ర‌భుత్వోద్యోగులు, పెన్ష‌న‌ర్ల‌కు రిలీఫ్ ల‌భించ‌నున్న‌ది‌. వ‌చ్చే జూలై ఒక‌టో తేదీ నుంచి వారికి క‌రువు భ‌త్యం (డీఏ) చెల్లింపులు అమ‌లులోకి రానున్న‌ది. మూడు వాయిదాల డీఏను జూలై ఒక‌టో తేదీ నుంచి చెల్లిస్తామ‌ని కేంద్ర ఆర్థిక‌శాఖ స‌హాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు.
 
క‌రోనా నేప‌థ్యంలో 2020 జ‌న‌వ‌రి ఒక‌టో తేదీ, జూలై ఒక‌టో తేదీ, 2021 జ‌న‌వ‌రి ఒకటో తేదీన చెల్లించాల్సిన డీఏను కేంద్రం పెండింగ్‌లో పెట్టిన స‌గ‌తి తెలిసిందే. ఇప్పుడు కేంద్ర ఉద్యోగులు, పెన్ష‌న‌ర్లు 17 శాతం డీఏ పొందుతున్నారు. ఏడో వేత‌న స‌వ‌ర‌ణ క‌మిష‌న్ సిఫారసుల ప్ర‌కారం వారి డీఏ పెరుగ‌నున్న‌ది.
 
2020 జ‌న‌వ‌రి ఒక‌టో తేదీ నుంచి మూడు శాతం పెంపుతో 28 శాతం, జూలై ఒక‌టో తేదీ నుంచి నాలుగు శాతం, 2021 జ‌న‌వ‌రి ఒక‌టో తేదీ నుంచి నాలుగు శాతంతో క‌లిపి వారి వేత‌నంలో అందుకోనున్నారు. 
 
కేంద్ర ఉద్యోగుల వేత‌నంపై డీఏ పెంపు ఇలా....
కేంద్ర ప్ర‌భుత్వోద్యోగుల స్థూల వేత‌నంలో బేసిక్ పే, డీఏ, ఇంటి అద్దె అల‌వెన్స్ (హెచ్ఆర్ఏ), ప్ర‌యాణ భ‌త్యం (టీఏ), వైద్య అల‌వెన్స్ త‌దిత‌రాలు క‌లుస్తాయి. ప్ర‌తిపాదిత డీఏ పెరగ‌డంతో వారి ప్రావిడెండ్ ఫండ్ (పీఎఫ్‌), గ్రాట్యూటీ కూడా పెరుగుతాయి. క‌నీస వేత‌నంలో నిర్దిష్ఠ శాతం, డీఏతో క‌లిపి పీఎఫ్‌, గ్రాట్యూటీ భాగ‌స్వామ్యాన్ని నిర్ణ‌యిస్తారు.