గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 6 అక్టోబరు 2021 (17:57 IST)

మహేశ్‌ దిమ్మతిరిగే ట్విస్ట్: లక్ష్మీ నరసింహ స్వామి గెటప్‌లో..?!

సూపర్ స్టార్ మహేష్ బాబు వేరియెంట్ రోల్ పోషించేందుకు సిద్ధం అవుతున్నాడు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'సర్కారువారి పాట' ఇందులో మహేశ్‌ దిమ్మతిరిగే ట్విస్ట్ ఇవ్వబోతున్నాడని ఫిలిం సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది. ఈ మూవీలో ఇంటర్వెల్‌ బ్యాంగ్ కు ముందు ఓ భారీ యాక్షన్ సన్నివేశం ఉంటుందట. 
 
ఆ సీన్ లో మహేశ్‌ బాబు లక్ష్మీ నరసింహ స్వామి గెటప్‌లో కనిపించ బోతున్నాడట. విలన్ మహేశ్‌ను అలా ఊహించుకుంటాడట. పరశురామ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. సంక్రాంతికి ఈ మూవీ థియేటర్స్ లోకి దిగబోతుంది.
 
కాగా.. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాల్లో మహేష్ బాబు హుందా రోల్ పోషించారు. ఇలాంటి ఎన్నో సూపర్‌ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న మహేశ్‌ గెటప్స్ జోలికి మాత్రం పెద్దగా పోలేదు.
 
ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన పోకిరిలో మాత్రం కాస్త లాంగ్ హెయిర్ తో కనిపించి వేరియేషన్ చూపించాడు. అయితే తాజాగా సర్కారు వారి పాటలో సూపర్ యాక్షన్ ద్వారా అభిమానులకు దిమ్మదిరిగే షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.