గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 27 జులై 2020 (11:44 IST)

బాలయ్య సినిమాలో ఆ సీక్వెన్స్ లేదు.. విలన్‌గా నవీన్..

కరోనా కారణంగా అవుట్ డోర్ షూటింగ్‌లు జరుగట్లేదు. ఇంకా సెట్స్ వేయలేని సీక్వెన్స్ తొలగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితే ప్రస్తుతం బాలయ్యకు ఏర్పడింది. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో మూడో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. బిబి3 వర్కింగ్ టైటిల్‌తో సినిమాను షూట్ చేస్తున్నారు. ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు. 
 
అయితే ప్రస్తుతం ఉన్న కరోనా వల్ల అవుట్ డోర్ షూటింగ్ నిర్వహించడం సాధ్యం కాదు. కానీ ఇప్పుడు బాలయ్య నటిస్తున్న సినిమాలో ఓ ముఖ్యమైన సీక్వెన్స్‌ను వారణాసి, హిమాలయాలలో షూట్ చేయాల్సి ఉంది. దీనిని సెట్ వేసి తీయడం కుదరదు, అలాగే అక్కడికి వెళ్లి తీయలేరు. అందుకే సినిమా నుండే ఈ సీక్వెన్స్ తీసేశారని తెలుస్తుంది. 
 
ఇకపోతే.. ఈ చిత్రంలో నవీన్ చంద్ర ఓ పాత్రలో నటిస్తున్నారు. ఇంతకముందు ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన అరవింద సమేత వీరరాఘవ సినిమాలో విలన్‌గా నటించి మెప్పించాడు. మళ్ళీ బాలయ్య సినిమాలో నటించబోతున్నాడు. ఇందులో నవీన్ విలన్‌గా కనిపిస్తాడా అనేది తేలాల్సి వుంది.