గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 19 జూన్ 2020 (13:33 IST)

అమేజాన్ ప్రైమ్ కోసం గౌతమ్ మీనన్ వెబ్ ‌సిరీస్

నిర్మాతగా, దర్శకుడిగా రాణిస్తున్న గౌతమ్ మీనన్ తాజాగా అభిమానులకు శుభవార్త చెప్పారు. అమేజాన్ ప్రైమ్ వీడియో కోసం వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాడు. స్టోరీ విషయంలో ఇటీవల చర్చలు జరగగా, అమేజాన్ వారికి నచ్చడంతో వెబ్ సిరీస్‌ని నిర్మించేందుకు ముందుకు వచ్చారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ ఈ వెబ్ సిరీస్‌కి పని చేయనున్నారు. 
 
లాక్‌డౌన్ పూర్తైన వెంటనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళనుంది. పీసీ శ్రీరామ్ తన ట్విట్టర్ ద్వారా గౌతమ్ మీనన్‌తో కలిసి వెబ్ సిరీస్ చేయనున్నట్టు పేర్కొన్నాడు. ఇప్పటికే దివంగత ముఖ్యమంత్రి జయలలితపై గౌతమ్ మీనన్ తీసిన క్వీన్ వెబ్ సిరీస్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అలాగే లాక్‌డౌన్ సమయంలో త్రిష, శింబు ప్రధాన పాత్రలలో ''కార్తీక్ డయిల్ సయిద ఎన్'' అనే షార్ట్ ఫిల్మ్ తీశాడు. 
 
ఇందులో శింబు, త్రిష మాత్రమే కనిపిస్తారు. ఎవరి ఇళ్లలో వాళ్లు ఉంటూ షూట్ చేసిన షార్ట్ ఫిల్మ్ ఇది. దీనికి రెహమాన్ నేపథ్య సంగీతం అందించడం విశేషం. అభిమానులకు ఓ సినిమా చూసిన అనుభూతిని షార్ట్ ఫిల్మ్‌లోనే కలిగించాడు గౌతమ్ మీనన్. దీంతో గౌతమ్ మీనన్ తీసే తదుపరి వెబ్ సిరీస్‌పై సినీ ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.