గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 7 సెప్టెంబరు 2019 (13:32 IST)

జయలలితగా రమ్యకృష్ణ.. ఫస్ట్ లుక్ అదిరింది గురూ...

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌కు రంగం సిద్ధం అయ్యింది. ముందుగా జయలలిత పాత్రలో కంగనా రనౌత్ కనిపించనుందని టాక్ వచ్చింది. నిత్యామీనన్ పేరు కూడా వినిపించింది. అయితే తాజాగా జయలలిత జీవితచరిత్రను 'క్వీన్' టైటిల్ తో వెబ్‌సిరీస్‌గా అందించడానికి దర్శకుడు గౌతమ్ మీనన్ తొలి ప్రయత్నం చేశాడు.
 
ఇప్పటికే వెబ్ సిరీస్ షూటింగ్ కూడా మొదలైంది. ఈ వెబ్ సిరీస్‌లో జయలలితగా రమ్యకృష్ణ నటిస్తోంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ నుంచి రమ్యకృష్ణ ఫస్టులుక్‌ను యూనిట్ విడుదల చేశారు. జయలలితగా ఆమె ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తున్నట్టు సదరు పోస్టర్లో వుంది. త్వరలోనే ఈ వెబ్ సిరీస్‌ను విడుదల చేసే తేదీని ప్రకటించనున్నట్లు యూనిట్ వర్గాల సమాచారం.
 
వెండితెర హీరోయిన్‌గా, రాజకీయ నాయకురాలిగా జయలలిత ప్రజల గుండెల్లో నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఆమె జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, అవమానాలు, విజయాల ఆధారంగా బయోపిక్‌లు సిద్ధమవుతున్నాయి. ఈ కారణంగానే ఆమె బయోపిక్‌ను రూపొందించడానికి పలువురు దర్శక నిర్మాతలు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో రూపుదిద్దుకునే రెండు బయోపిక్‌ల్లో కంగనా, నిత్యామీనన్ నటిస్తున్నారు.