బాలీవుడ్లో మ‌రో క్వీన్ బ‌యోపిక్... ఇంత‌కీ ఎవ‌రా క్వీన్..?

శ్రీ| Last Modified బుధవారం, 28 ఆగస్టు 2019 (19:42 IST)
ప్ర‌స్తుతం ప్రతి సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ సినిమాల సందడి ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా చారిత్రాత్మక నేపథ్యంలో ఎక్కువ సినిమాలు తెరకెక్కుతున్నాయి. వీరనారి ఝాన్సీ లక్ష్మి భాయి జీవిత ఆధారంగా మణికర్ణిక ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో మహారాణి జీవితాన్ని తెరపైకి తేవడానికి రంగం సిద్ధమవుతోంది.

కాశ్మీర్ చివరి హిందూ మహారాణి బయోపిక్‌ను తెరకెక్కించడానికి బాలీవుడ్ ప్రముఖ నిర్మాత మధు మంతెన సిద్ధమయ్యారు. 14వ శతాబ్దంలో కోటరాణిగా పిలవబడే ఆ మహారాణి కాశ్మీర్‌ని పాలించిన చివరి హిందువు. అందంతోనే కాకుండా ఆమె పలు రకాలుగా చరిత్రకెక్కారు.

తన ప్రణాళికలతో సైనిక దళాలను ఏర్పాటు చేసుకోవడం అలాగే శత్రువులను బుద్ధిబలంతో తిప్పికొట్టడం కోటరాణికి వెన్నతో పెట్టిన విద్య. త్వరలోనే సినిమాకు సంబందించిన పూర్తి వివరాలు వెలువడనున్నాయి. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ కూడా సినిమా నిర్మాణంలో భాగం కానుంది.దీనిపై మరింత చదవండి :