శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Modified: సోమవారం, 26 ఆగస్టు 2019 (20:05 IST)

కశ్మీర్: మీరలాగే గుడ్లప్పగించి చూస్తుండండి.. మేమేం చేస్తామో చూపిస్తాం: ఇమ్రాన్ వార్నింగ్

కశ్మీర్ అంశంపై అంతర్జాతీయ సమాజం పాకిస్తాన్ దేశానికి రవ్వంత మద్దతు కూడా లభించడంలేదు. దీనితో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తోక తొక్కిన కోతిలా గెంతులేస్తున్నారు. ఇప్పటివరకూ కశ్మీర్ అంశంపైన బ్రతిమలాడుతూ వచ్చిన ఇమ్రాన్ ఖాన్, తాజాగా తన స్వరాన్ని మార్చాడు. బెదిరింపులకు దిగాడు.
 
కశ్మీర్ అంశం ద్వైపాక్షిమే అని ట్రంప్ ప్రకటన చేసిన కొద్ది నిమిషాల్లోనే ఇమ్రాన్ ఖాన్ ఓ ప్రకటన చేశారు. కశ్మీర్ వ్యవహారంపై మీరలానే మాట్లాడుతూ వుండండి. ఈ వివాదం యుద్ధానికి దారి తీస్తే మాత్రం ఆ ప్రకంపనలు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తాయని గుర్తుంచుకోండి. 
 
రెండు దేశాలు అణ్వాయుధాలను కలిగిన దేశాలే. అణు యుద్ధమే సంభవిస్తే ఆ యుద్ధంలో ఏ దేశమూ విజేత కాబోదు. అందుకని కశ్మీర్ విషయంలో అగ్ర రాజ్యాలు గుడ్లప్పగించి చూస్తూ వుంటే మాత్రం సహించబోము. ఈ విషయంలో ఎంత దూరానికైనా వెళ్లేందుకు తాము సిద్ధం అంటూ అగ్ర రాజ్యాలకు వార్నింగ్ ఇచ్చాడు ఇమ్రాన్. మరి ఈ బెదిరింపులపై అగ్ర రాజ్యాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.